అంగరంగ వైభవంగా లోటస్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

Published On: June 22, 2018   |   Posted By:

అంగరంగ వైభవంగా లోటస్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ్మారెడ్డి,రాజ్ కందుకూరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా లోటస్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

ప్రముఖ సంస్థ లోటస్ ఫిల్మ్ అవార్డ్స్ 3 వ వార్షికోత్సవం సందర్భంగా హైదరబాద్ లోని ప్రసాద్ లాబ్స్  లో లోటస్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక అత్యంతవైభవంగా జరిగింది.

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, జాతీయ అవార్డ్ గ్రహీత ,నిర్మాత రాజ్ కందుకూరి, రాజ్ ముదిరాజ్,గాయత్రి గుప్త మరియిప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో డాక్టర్ ఆనంద్ “చిరు తేజ్ సింగ్” చిత్రానికి గాను,ఉత్తమ దర్శకునిగా అవార్డ్ ని తీసుకోవడం జరిగింది.

అలాగే ఉత్తమ బాల నటిగా 9 సంవత్సరాల వయసులోనే ఒక నిమిషంలో 125 దేశాలను గుర్తించి ప్రపంచ రికార్డ్ లను  సొంతం చేసుకున్న చిరు తేజ్సింగ్ కు లభించడం విశేషం.

ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ,చిరు తేజ్ సింగ్ మాట్లాడుతూ తమ ప్రతిభను గుర్తించిన లోటస్ యాజ మాన్యానికి,నిర్మాత యన్.యస్నాయక్ గారికి,హీరోయిన్ మనాలీ రాథోడ్,సౌమ్య వేణు గోపాల్ గారికి ధన్య వాదాలు తెలియ చేసారు.

అలాగే వివిధ కేటగీరీలలో ఒక్క క్షణం, మంగమ్మ గారి మనవడు,నా కథ, మర్డర్, అలనాటి రామ చంద్రులు, సంద్రం, ఆలు ఫ్రై ,సూర్య భాయి,తరుణం,బీప్ తదితర చిత్రాలు అవార్డ్ లను దక్కించుకున్నాయి.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మరియు రాజ్ కందుకూరి మాట్లాడుతూ,కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే లోటస్ లాంటి సంస్థలు ఇంకాముందుకు రావాలని,రేపటి తెలుగు చిత్ర పరిశ్రమను శాసించేది నేటి లఘు చిత్ర దర్శకులే అని నిర్వాహకురాలైన నళిని గారిని కొనియాడడంజరిగింది.