అక్క‌డ సంద‌డి షురూ చేయ‌నున్న బాహుబ‌లి 2

Published On: December 19, 2017   |   Posted By:
అక్క‌డ సంద‌డి షురూ చేయ‌నున్న బాహుబ‌లి 2
తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్ర‌పంచానికి చాటి చెప్పిన చిత్రం `బాహుబ‌లి`. రెండు భాగాలుగా విడుద‌లైన ఈ సినిమా దాదాపు 2400కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ముఖ్యంగా బాహుబ‌లి 2 1700 కోట్ల రూపాయ‌ల‌ను రాబ‌ట్ట‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ విజువ‌ల్ వండ‌ర్‌లో ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, త‌మ‌న్నా, స‌త్య‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌లు త‌మ‌దైన పాత్ర‌లు పోషించి మెప్పించారు. కాగా ఇప్పుడు ఈ సినిమా జ‌పాన్‌లో సంద‌డి చేయ‌నుంది. డిసెంబ‌ర్ 29న జ‌పాన్ బాహుబ‌లి 2 విడుద‌ల కానుంది. మ‌రి జ‌పాన్‌లో ఎలాంటి సంద‌డి చేయ‌నుందో చూడాల్సిందే..