అఖిల్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌

Published On: September 13, 2017   |   Posted By:

అఖిల్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మూడో త‌రం న‌ట‌వార‌సుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన న‌టుడు  అక్కినేని అఖిల్‌. ఇప్పుడు రెండో చిత్రంగా అఖిల్ న‌టిస్తున్న చిత్రం `హ‌లో`.

మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌త‌క్వంలో సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
అయితే ఆస‌క్తిక‌రమైన విష‌య‌మేమంటే ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న మ‌రో హీరోయిన్‌గా కూడా న‌టిస్తుంద‌ట‌. ఆమె ఎవ‌రో కాదు. త‌మిళ చిత్రం మ‌గిల‌ర్ మట్టుమ్ సినిమాలో న‌టించిన నివేదిత స‌తీష్‌. ఈ అమ్మ‌డు తొలి చిత్రం ఈ సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల కానుంది. ఈ సినిమా విడుద‌ల కాక‌మునుపే అఖిల్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవడం ఓ ర‌కంగా మంచి ల‌క్ అనే చెప్పాలి. ఈ హలో సినిమాను డిసెంబ‌ర్ 22న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత అక్కినేని నాగార్జున ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.