అఖిల్ హలో బిజినెస్ ప్రారంభం

Published On: November 13, 2017   |   Posted By:

అఖిల్ హలో బిజినెస్ ప్రారంభం

అక్కినేని అఖిల్ హీరోగా, నాగార్జున నిర్మిస్తున్న సినిమా అఖిల్. ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చేయడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. అప్పుడే సగానికి సగం ఏరియాస్ బిజినెస్ పూర్తయినట్టు ప్రకటించింది అన్నపూర్ణ స్టుడియోస్. అయితే ఏ  ఏరియా ఎంతకు అమ్ముడుపోయిందనే విషయంపై మాత్రం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా హక్కుల్ని ఎస్వీ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 3 కోట్ల రూపాయలకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రతో పాటు సీడెడ్ లోని కొన్ని ఏరియాల్లో సొంత రిలీజ్ కు వెళ్తున్నారు నాగార్జున. నైజాంకు సంబంధించి మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఓవరాల్ గా హలో సినిమాతో నాగార్జునకు 20 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశాలున్నాయంటోంది ట్రేడ్.