అచ్చొచ్చిన హీరోయిన్‌తో  రామ్

Published On: November 22, 2017   |   Posted By:

అచ్చొచ్చిన హీరోయిన్‌తో  రామ్

2016లో విడుద‌లైన `నేను శైల‌జ‌` చిత్రం రామ్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఆ సినిమాను కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తే, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. శైల‌జ‌గా కీర్తిసురేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇప్పుడు రామ్ త‌న‌కు హిట్ అందించిన హీరోయిన్ కీర్తి సురేష్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడ‌ట‌. వివ‌రాల్లోకెళ్తే. ..రామ్ హీరోగా త్రినాథ‌రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తాడ‌ట‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను న‌టింప‌చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో `నేను లోక‌ల్` సినిమా చేసిన కీర్తి సురేష్ ..మ‌ళ్లీ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ట‌.