అజిత్ `వివేకం` వాయిదా

Published On: August 1, 2017   |   Posted By:

 అజిత్ `వివేకం` వాయిదా

త‌మిళ స్టార్ అజిత్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం వివేకం(త‌మిళంలో వివేగం). శివ ద‌ర్శ‌కుడు. స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆరంభం, వీరం, వేదాళం వంటి వ‌రుస హిట్స్ త‌ర్వాత శివ ద‌ర్శ‌క‌త్వంలో అజిత్ చేస్తున్న సినిమా ఇది. శివ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తెలుగులో వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ శొంఠినేని ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.  ఈ సినిమాను ముందుగా ఆగ‌స్ట్ 10న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం వివేకం ఆగ‌స్ట్ 24న విడుద‌ల‌వుతుందట‌. ఈ చిత్రంలో అజిత్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్, అక్ష‌ర హాస‌న్ హీరోయిన్స్‌గా నటిస్తుంటే వివేక్ ఓబెరాయ్ విల‌న్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.