అజ్ఞాతవాసి ఆడియోకు రికార్డు ధర

Published On: November 21, 2017   |   Posted By:
తెలుగు చిత్రసీమలో ఇదొక రికార్డు. ఇప్పటివరకు ఏ సినిమా ఆడియో రైట్స్ ఇంత ధరకు అమ్ముడుపోలేదు. చివరికి బాహుబలి-2 ఆడియో రైట్స్ కూడా ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోలేదు. ఇలాంటి అరుదైన రికార్డును పవన్ కల్యాణ్ సృష్టించాడు. అవును.. పవన్ నటిస్తున్న అజ్ఞాతవాసి ఆడియో రైట్స్ ఏకంగా 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఆడియో రైట్స్ లో ఇదే పెద్ద డీల్.
ఈ మూవీ ఆడియో రైట్స్ కు ఇంత పెద్ద ఎమౌంట్ దక్కడానికి కారణం ఒకే ఒక్క సింగిల్. సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేసిన బయటకొచ్చి చూస్తే అనే సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో అజ్ఞాతవాసి ఆడియోపై అంచనాలు పెరిగాయి. అందుకే 2 కోట్ల రూపాయల హయ్యస్ట్ రేటు దక్కింది ఈ సినిమాకు. ఈ డీల్ ఎవరు దక్కించుకున్నారనే విషయంతో పాటు ఇతరత్రా వివరాలతో మరికాసేపట్లో ప్రెస్ నోట్ బయటకురానుంది.