అజ్ఞాతవాసి ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 11 కోట్లు

Published On: December 11, 2017   |   Posted By:

అజ్ఞాతవాసి ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 11 కోట్లు

ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ లో అజ్ఞాతవాసి సినిమా దుమ్ముదులిపింది. సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఏకంగా 11 కోట్ల రూపాయలకు ఈ సినిమా ఉత్తరాంధ్ర రైట్స్ అమ్ముడుపోయాయి. దాదాపు నెల రోజుల కిందటే ఈ డీల్ ముగిసినప్పటికీ.. తాజాగా ఎమౌంట్ బయటపడింది. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ AV-సినిమాస్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది.

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. సో.. బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే కనీసం 200 కోట్ల రూపాయల గ్రాస్ రావాల్సి ఉంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఞాతవాసి సినిమా థియేటర్లలోకి వస్తుంది.