అజ్ఞాతవాసి టీజర్ రివ్యూ

Published On: December 18, 2017   |   Posted By:
అజ్ఞాతవాసి టీజర్ రివ్యూ

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అజ్ఞాతవాసి టీజర్ రిలీజైంది. ఈ కాంబినేషన్ నుంచి ఆడియన్స్ ఏదైతే ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కలుపుకొని కట్ అయింది అజ్ఞాతవాసి టీజర్. ఓవైపు క్లాస్, మరోవైపు మాస్ మిక్స్ చేసి చూపించడం ఈ టీజర్ ప్రత్యేకత.
అత్తారింటికి దారేది సినిమాకు ఫాలో అయిన పద్ధతినే మరోసారి అజ్ఞాతవాసి కోసం వాడుకున్నాడు త్రివిక్రమ్. దేవదేవం భజే అనే క్లాసికల్ సాంగ్ తో అత్తారింటికి దారేది ట్రయిలర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్.. అజ్ఞాతవాసి కోసం “మధురాపురి సదనా..” అనే మరో మృదువైన గీతాన్ని అందుకున్నాడు.
ఇక విజువల్స్ విషయానికొస్తే.. రొమాన్స్, కామెడీ, యాక్షన్, హీరోయిజం.. ఇలా అన్నీ ఉన్నాయి అజ్ఞాతవాసి టీజర్ లో. కాకపోతే సినిమాలో కీలక పాత్ర పోషించిన ఖుష్బూను మాత్రం టీజర్ లో చూపించలేదు. వెనక నుంచి చూపించి సస్పెన్స్ మెయింటైన్ చేశారు.
క్లాసీ-మాసీ టచ్ తో వచ్చిన ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అక్కడక్కడ అత్తారింటికి దారేది ఛాయలు కనిపించినప్పటికీ.. ఓవరాల్ గా అజ్ఞాతవాసి టీజర్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఞాతవాసి థియేటర్లలోకి వస్తున్నాడు.