అజ్ఞాతవాసి ప్రీమియర్స్ కు నో పర్మిషన్

Published On: January 9, 2018   |   Posted By:
అజ్ఞాతవాసి ప్రీమియర్స్ కు నో పర్మిషన్
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అజ్ఞాతవాసి. ఈ సినిమాను రాత్రి 1గంట నుంచి ఉదయం 8 గంటల మధ్య ప్రత్యేకంగా ప్రదర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ నుంచి కూడా ప్రత్యేక అనుమతి వస్తుందని అంతా ఎదురుచూశారు. కానీ పోలీసుల నుంచి ఈ సినిమాకు ప్రత్యేక అనుమతి రాలేదు.
తెలంగాణలో అర్థరాత్రి ప్రీమియర్స్ కు అనుమతి నిరాకరించారు పోలీసులు. చాలా థియేటర్లలో మిడ్-నైట్ షోలు వేస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదముందని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఆ ఆస్కారం ఎక్కువని భావించిన పోలీసులు అనుమతి నిరాకరించారు. సో.. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల షో నుంచే ప్రారంభంకానుంది అజ్ఞాతవాసి.