అజ్ఞాతవాసి ప్రీ-రిలీజ్ బిజినెస్

Published On: November 15, 2017   |   Posted By:
అజ్ఞాతవాసి ప్రీ-రిలీజ్ బిజినెస్
కేవలం ఏపీ, నైజాంలోనే 90కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసింది పవన్ కల్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి. వరల్డ్ వైడ్ ఈ లెక్క చూసుకుంటే.. 110 కోట్ల రూపాయల పైమాటే. ఇక వీటికి ఆడియో, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా కలిపి చూస్తే అటుఇటుగా 150 కోట్ల రూపాయల బిజినెస్ జరిగి ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి, ఈ కింది ఏరియాల్లో ఈ విధంగా బిజినెస్ చేసింది.
నైజాం – రూ. 29 కోట్లు – దిల్ రాజు దక్కించుకున్నారు.
ఈస్ట్ – రూ. 8.10 కోట్లు – నెక్కంటి రామ్ మోహన్ చౌదరి అనే ఎన్నారై దక్కించుకున్నారు
గుంటూరు – రూ. 7 కోట్లు – కార్తీక్ ఫిలిమ్స్ కు చెందిన రవి చౌదరి దక్కించుకున్నారు
సీడెడ్ – రూ. 16.20 కోట్లు – గంగాధర్, శివ దక్కించుకున్నారు.