అజ్ఞాతవాసి ఫస్ట్ డే వసూళ్లు

Published On: January 11, 2018   |   Posted By:
అజ్ఞాతవాసి ఫస్ట్ డే వసూళ్లు
పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా మొదటి రోజు వసూళ్లలో దుమ్ముదులిపింది. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలిరోజు వసూళ్లపై ఆ ప్రభావం పడలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ డే 27 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో మొదటి రోజే ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్లు ఆర్జించింది. ఏకంగా 9 కోట్ల 65 లక్షల రూపాయలు కొల్లగొట్టింది.
ఏపీ, నైజాం ఫస్ట్ డే వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 5.45 కోట్లు
సీడెడ్ – రూ. 3.38 కోట్లు
కృష్ణా – రూ. 1.82 కోట్లు
గుంటూరు – రూ. 3.78 కోట్లు
ఈస్ట్ – రూ. 2.85 కోట్లు
వెస్ట్ – రూ. 3.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.30 కోట్లు
నెల్లూరు – రూ. 1.64 కోట్లు
మొదటి రోజు మొత్తం షేర్ – రూ. 26.92 కోట్లు