అజ్ఞాతవాసి 2 రోజుల వసూళ్లు

Published On: January 12, 2018   |   Posted By:
అజ్ఞాతవాసి 2 రోజుల వసూళ్లు
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా పడిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో టిక్కెట్లు తీసుకున్న వాళ్లు కూడా థియేటర్లకు వెళ్లలేదు. ఉత్తరాంధ్ర, వెస్ట్, కృష్ణా లాంటి ప్రాంతాల్లో కొన్ని థియేటర్లలో అదనపు ప్రదర్శనలు కూడా రద్దు చేశారు. అలా భారీ డ్రాప్ కారణంగా రెండో రోజు అజ్ఞాతవాసి సినిమాకు కేవలం 3 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. మొదటి రోజు వసూళ్లతో కలిపి చూస్తే  ఈ రెండు రోజుల్లో అజ్ఞాతవాసి సినిమాకు 30 కోట్ల 72 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలకు చెందిన అజ్ఞాతవాసి 2 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి.
2 రోజుల టోటల్ కలెక్షన్ (షేర్)
నైజాం – రూ. 7.32 కోట్లు
కృష్ణా – రూ. 2.11 కోట్లు
గుంటూరు – రూ. 4.06 కోట్లు
ఈస్ట్ – రూ. 3.03 కోట్లు
వెస్ట్ – రూ. 3.82 కోట్లు