అజ‌య్ హీరోగా స్పెష‌ల్ మూవీ 21న విడుద‌ల‌

Published On: June 17, 2019   |   Posted By:

అజ‌య్ హీరోగా  స్పెష‌ల్ మూవీ 21న విడుద‌ల‌

విలన్ గా సహనటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. అప్పుడప్పుడు సినిమాల్లో కథానాయకుడి పాత్రలు కూడా చేస్తున్నారు. మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తోన్న స్పెషల్ అనే సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడానికి కారణమైన వారిని తెలుసుకొని మైండ్ రీడర్ వారిని ఎలా అంతం చేశాడు అనేది సినిమా కథ అని దర్శకుడు వాస్తవ్ తెలిపారు. అజయ్… గతంలో ఒకటి రెండు సినిమాల్లో హీరోగానూ కనిపించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తాజాగా ఆయన ‘స్పెషల్’ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నారు. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకి వాత్సవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని 21 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సంద‌ర్భంగా


ద‌ర్శ‌క, నిర్మాత‌ వాస్త‌వ్ మాట్లాడుతూ…ఈ చిత్రం 21న విడుద‌ల కానుంది. మైండ్‌రీడ‌ర్ స్టోరీ ఫెంటాస్టిక్ థ్రిల్ల‌ర్‌. గ‌జినిటైప్ జోన‌ర్ మూవీ ఇది. ల‌వ్‌, ఎమోష‌న్స్ అన్ని ఉన్న క‌థ ఇది. చిన్న‌సినిమానేకాని మీరంద‌రూ చూసిన త‌ర్వాత పెద్ద సినిమాగా భావిస్తారు. ఈ సినిమాకి అజ‌య్ పెద్ద రాకెట్ అన్నారు. స్పెష‌ల్ మూవీ త‌న కెరియ‌ర్‌కి ఎంతో స్పెష‌ల్ అని అన్నారు.ఈ సినిమాలో ఆయ‌న విజృంభించారు. అక్షిత ఈ చిత్రంలో స్హీరోయిన్ ఎంతో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా చాలా పెద్ద బ‌డ్జెట్ అనుకున్నాం. కాని చాలా మటుకు చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసి చిన్న బ‌డ్జెట్‌లో తీశాం. స్టోరీ, స్కీన్‌ప్లే, డైలాగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. స్ట్రాంగ్ స్ర్కీన్‌ప్లే చాలా రేర్‌గా ఉంటుంది అని అన్నారు.


అక్షిత‌శ్రీ‌నివాస్ మాట్లాడుతూ… నా చిన్న‌ప్ప‌టి నుంచి థ్రిల్ల‌ర్స్ అంటే నాకు బాగా ఇష్టం. విక్ర‌మ‌భేతాలుడు లాంటి చిత్రాలు ఎన్నో చూస్తాను. ప్ర‌స్తుతం తెలుగు ఆడియ‌న్స్‌లో చాలా మార్పువ‌చ్చింది. హీరోహీరోయిన్స్‌కంటే క‌థ‌కి ఎక్కువ ప్రాధాన్య‌త‌ని ఇస్తున్నారు. వాస్త‌వ్‌గారు చాలా బాగా తీశారు. ఈ చిత్రానికి న‌లుగురు పిల్ల‌ర్స్ ఒక‌టి అజ‌య్‌, రెండు నేను మ‌రొక‌టి హీరో రామ్‌,  డైరెక్ట‌ర్‌గారు మేం న‌లుగురం చాలా క‌ష్ట‌ప‌డ్డాం.మూవీ ఆర్ ఆర్ కూడా చాలా బాగా వ‌చ్చింది. ఆల్ ద బెస్ట్‌టు ద ఎంటైర్ స్పెష‌ల్ మూవీ టీం అని అన్నారు.