అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూత

Published On: February 25, 2018   |   Posted By:
అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూత
లెజండరీ నటి .. అతిలోక సుందరి శ్రీదేవి (54) ఇక లేరు. బంధువుల వెడ్డింగ్ నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త్ బోనీకపూర్ స్పష్టంచేశారు.
దఢక్ చిత్ర షూటింగ్ కారణంగా జాన్వీ కపూర్ వెడ్డింగ్‌కి వెళ్లలేదని సమాచారం. శ్రీదేవి హార్ట్ ఎటాక్‌తో మరిణించారనే విషయం తెలిసిన బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కి గురయింది. సోషల్ మీడియా అంతా ఈ వార్త వ్యాపించింది. దాదాపు సినీప్రముఖులంతా శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు.
శ్రీదేవి 13 ఆగస్టు 1963లో జన్మించారు. బాలనటిగా 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
6 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన శ్రీదేవిని 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.