అదిరింది నైజాం కలెక్షన్లు

Published On: November 13, 2017   |   Posted By:

అదిరింది నైజాం కలెక్షన్లు

ఎట్టకేలకు తెలుగులో మార్కెట్ తెరిచాడు విజయ్. ఇతడు నటించిన అదిరింది సినిమాకు టాలీవుడ్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన మొదటి రోజే కోటి 60లక్షల రూపాయల షేర్ రాబట్టి ఈ సినిమా నైజాంలో మరింత స్ట్రాంగ్ అయింది. సోమవారం నుంచి ఈ మూవీకి ఎక్స్ ట్రా థియేటర్లు కేటాయించబోతున్నారు.
ఇక నైజాం కలెక్షన్ల విషయానికొస్తే.. అదిరింది సినిమాకు మొదటి రోజు 47 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక రెండో రోజు 19లక్షలు షేర్ వచ్చింది. అలా విడుదలైన 2 రోజుల్లో నైజాంలో ఈ సినిమాకు 66లక్షల రూపాయల షేర్ వచ్చింది.