అదిరింది మూవీ గుంటూరు, కృష్ణా జిల్లా వసూళ్లు

Published On: November 14, 2017   |   Posted By:
అదిరింది మూవీ గుంటూరు, కృష్ణా జిల్లా వసూళ్లు
విజయ్ హీరోగా నటించిన అదిరింది సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అట్లీ డైరక్షన్ లో నిత్యామీనన్, సమంత, కాజల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. నైజాంలో కోటి రూపాయల షేర్ కు దగ్గరగా వచ్చిన ఈ సినిమా.. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఊహించిన దానికంటే మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
గుంటూరు
నాలుగో రోజు షేర్ – రూ. 7,37,633
4 రోజుల మొత్తం షేర్ – రూ. 42,15,670
కృష్ణా
ఐదో రోజు షేర్ – రూ. 2, 31,699
5 రోజుల మొత్తం షేర్ – రూ.  44, 76, 267
గుంటూరులో 30లక్షల అడ్వాన్స్ మీద ఈ సినిమా రిలీజ్ చేశారు.. అంటే ఆ ప్రాంతంలో సినిమా బ్రేక్ ఈవెన్ లోకి వచ్చేసినట్టే. కృష్ణాలో కూడా దాదాపు ఇంతే మొత్తం అడ్వాన్స్ గా తీసుకున్నారు. ఇక్కడ కూడా లాభాల్లోకి వచ్చేసింది అదిరింది మూవీ.