అదిరింది మూవీ 3 రోజుల షేర్

Published On: November 13, 2017   |   Posted By:

అదిరింది మూవీ 3 రోజుల షేర్

ప్రస్తుతం టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా కొనసాగుతున్న సినిమా అదిరింది మాత్రమే. ఈ మూవీతో పాటు మరో 4 సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నప్పటికీ అదిరింది సినిమా చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. విజయ్ నటించిన ఈ సినిమాకు రోజురోజుకు కలెక్షన్ల తో పాటు థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. విడుదలైన మొదటి రోజు కోటి రూపాయలకు పైగా షేర్ సాధించిన అదిరింది సినిమా.. ఈ 3 రోజుల్లో ఏకంగా ఆంధ్రప్రదేశ్, నైజాం కలుపుకొని 3 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ సాధించింది. తెలుగులో శరత్ మరార్ సమర్పించిన ఈ సినిమాలో సమంత, కాజల్, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. రెహ్మాన్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో వందకు 300 రూపాయల లాభం అందుకుంటున్నాడు నిర్మాత శరత్ మరార్.