అధికారికంగా పక్కా అయిన జవాన్ విడుదల తేదీ

Published On: October 21, 2017   |   Posted By:
అధికారికంగా పక్కా అయిన జవాన్ విడుదల తేదీ
బీవీఎస్ రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా జవాన్. ఈ సినిమా ఇప్పటికే 3సార్లు వాయిదాపడింది. తాజాగా దసరా బరిలో నిలపాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. మరోవైపు ఈ సినిమాను డిసెంబర్ 1న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అంతా ఊహించినట్టుగానే జవాన్ చిత్రాన్ని డిసెంబర్ 1న థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని మేకర్స్ ప్రకటించారు.
జవాన్ సినిమాలో సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇంటికొక్కడు అనేది ఈ సినిమా క్యాప్షన్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
జవాన్ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తి కిరీటం కాదు కృతజ్ఞత అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓ సాంగ్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సాయిధరమ్ తేజ్, త్వరలోనే ఈ మూవీ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నాడు.