అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ డబ్బింగ్ ?

Published On: September 9, 2017   |   Posted By:
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ డబ్బింగ్ ?
అఆ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.  ఆ త‌రువాత ప్రేమ‌మ్‌, శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాల‌తో ఇక్క‌డివారికి మ‌రింత ద‌గ్గ‌రైంది.
ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ’ చిత్రంలో న‌టిస్తోంది. రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలో విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం అనుప‌మ డ‌బ్బింగ్ చెప్పుకోనుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన త‌క్కువ కాలంలోనే అనుప‌మ డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం
మెచ్చుకోత‌గ్గ విష‌యం.