అనుష్క పరిశ్రమకొచ్చి పుష్కరం

Published On: July 20, 2017   |   Posted By:

అనుష్క పరిశ్రమకొచ్చి పుష్కరం

టాలీవుడ్ బొమ్మాలి అనుష్క ఇండస్ట్రీకొచ్చి రేపటికి సరిగ్గా 12 ఏళ్లు అవుతోంది. సరిగ్గా పుష్కరం కిందట అంటే.. 2005 జులై 21న అనుష్క నటించిన మొదటి చిత్రం సూపర్ రిలీజైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఆ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది అనుష్క. చేసింది సెకెండ్ హీరోయిన్ పాత్రే అయినప్పటికీ ఆమె లుక్స్, పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

అలా తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, విక్రమార్కుడు సక్సెస్ తో మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటికే హిట్స్ మీదున్న అనుష్క కెరీర్ ను అతిపెద్ద మలుపు తిప్పింది అరుంధతి సినిమా. ఇప్పటికీ అనుష్కను అంతా బొమ్మాలి అని పిలుస్తున్నారంటే దానికి కారణం అనుష్క. ఈ మూవీతోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది అనుష్క.

12 ఏళ్ల కెరీర్ లో ఇప్పటివరకు 44 సినిమాలు చేసిన అనుష్క బాహుబలి విజయంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం భాగమతి సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. మరిన్ని సినిమాలు చేయాలని మనసారా కోరుకుంటోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.కామ్.