అన్నపూర్ణమ్మ గారి మనవడు ఫిబ్రవరి విడుదల

Published On: January 20, 2020   |   Posted By:

అన్నపూర్ణమ్మ గారి మనవడు ఫిబ్రవరి విడుదల

ఫిబ్రవరి 7న వస్తున్న అన్నపూర్ణమ్మ గారి మనవడు 

స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమలను తెలియజేస్తూ…ఉమ్మడి కుటుంభాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను  సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రం  “అన్నపూర్ణమ్మ గారి మనవడు”. టైటిల్ పాత్రధారులుగా.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా…బాలదిత్య, అర్చన హీరో, హీరోయిన్లుగాను,  మహానటి జమున ఒక కీలక పాత్రలో నటించారు. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగావిడుదల చేయనున్నామని నిర్మాత ఎం.ఎన్.ఆర్. చౌదరి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, కొంతమంది మిత్రుల,శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ చిత్రాన్నిఅమృత, ప్రణయ్ లకు అంకితమిస్తున్నామని వెల్లడించారు. దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ చిత్రంలో అక్కినేని అన్నపూర్ణమ్మగా, వైకుంఠపురం అనే గ్రామ జమిందారినిగా అన్నపూర్ణమ్మ నటన హైలైట్. మనవడి పాత్రకు మాస్టర్ రవితేజ ప్రాణం పోసాడు. అక్కినేని అనసూయమ్మగా జమున  అలరిస్తారు. ఇక మిర్యాలగూడలో యథార్థంగా జరిగిన అమృత, ప్రణయ్ ప్రేమకథలో బాలాదిత్య, అర్చనలు తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఇంకా,బెనర్జి, రఘుబాబు , కారుమంచి రఘు,తాగుబోతు రమేష్,సుమన్శెట్టి,శ్రీ లక్ష్మి,సుధ,జయవాణి తదితరులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు. ,సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో హైలెట్ అని అన్నారు.