అన్న‌య్య‌తో ప‌దేళ్ల త‌ర్వాత‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

Published On: November 27, 2017   |   Posted By:

అన్న‌య్య‌తో ప‌దేళ్ల త‌ర్వాత‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `అజ్ఞాత‌వాసి`. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ వారణాసిలో జ‌రుగుతుంది. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ సంతోష్ శ్రీన్‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రో వైపు పాలిటిక్స్‌పై కూడా ప‌వ‌న్ దృష్టి సారిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంత‌కి అదేమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా న‌ర‌సింహారెడ్డి’లో పవన్ ఒక పాత్ర చేయబోతున్నార‌న్న‌ది.అది కేవ‌లం 10నిమిషాల  నిడివిగల పాత్ర అని.. అయితే చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని స‌మాచార‌మ్‌. ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి సమాచారం బయటకి రాలేదు. ఇదే నిజమైతే అన్నదమ్ములిద్దరు…శంక‌ర్ దాదా జిందాబాద్ త‌ర్వాత అంటే పది సంవత్సరాల తర్వాత క‌లిసి న‌టించే చిత్ర‌మిదే అవుతుంది.