అన్ లిమిటెడ్ చిత్రం చిత్రీకరణ చివరి దశలో

Published On: September 30, 2020   |   Posted By:
అన్ లిమిటెడ్ చిత్రం చిత్రీకరణ చివరి దశలో
 
చిత్రీకరణ చివరి దశలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అన్ లిమిటెడ్
 
నార్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో  ఏషాన్ , ఆయిషా కపూర్  లని హీరో హీరోయిన్లు గా అమన్ కుమార్ , శ్రద్ధ ద్వివేది ,  తనూజ్ దీక్షిత్ , అనిల్ రాస్తోగి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అన్ లిమిటెడ్’. విక్రమ్ వాసుదేవ్ నార్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ  నిర్మిస్తున్నారు.
 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత,దర్శకుడు  విక్రమ్ వాసుదేవ్ నార్ల మాట్లాడుతూ…
విమెన్ ఎంపవర్మెంట్ ని తప్పుదారి పట్టిస్తున్న  కొంతమంది వల్ల సమాజానికి జరుగుతున్న చేటుని చెబుతూనే  సృష్టికి మూలాధారమైన ఓం కారం  లో ఇమిడి ఉన్న అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రధాన అంశం గా” అతి సర్వత్ర వర్జయేత్” అన్న ట్యాగ్ లైన్ తో నార్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో  ఏషాన్ , ఆయిషా కపూర్  లని హీరో హీరోయిన్ లు గా  పరిచయం చేస్తూ తెలుగు, హిందీ భాషలలో  మీడియా బ్యాక్ డ్రాప్ లో  రానున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ.   ’అన్ లిమిటెడ్’.   
 
కథానుగుణం గా హైదరాబాద్ , లక్నో నగరాలలో 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది.  ఈ లాక్ డౌన్ కారణం గా  తదుపరి  షెడ్యుల్ ను  దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
 
నటీనటులు:
 
ఏషాన్ , ఆయిషా కపూర్, అమన్ కుమార్ , శ్రద్ధ ద్వివేది ,  తనూజ్ దీక్షిత్ , అనిల్ రాస్తోగి
 
నిర్మాత, దర్శకత్వం: విక్రమ్ వాసుదేవ్ నార్ల
మాటలు:  చిట్టి శర్మ  , సినిమాటోగ్రఫీ:  వినోత్, కుమార్
మ్యూజిక్ :  రోహిత్ జిల్లా