అప్పుడు చేతిలో సైకిల్ చైన్, ఇప్పుడు రుద్రాక్షలు

Published On: August 29, 2017   |   Posted By:

అప్పుడు చేతిలో సైకిల్ చైన్, ఇప్పుడు రుద్రాక్షలు

ట్రెండ్ సెట్ చేయాలన్నా, కొత్త కొత్త పాత్రల్ని పోషించాలన్నా నాగార్జున తర్వాతే ఎవరైనా. అప్పుడెప్పుడో పాతికేళ్ల కిందటే శివతో ట్రెండ్ సృష్టించాడు ఈ టాలీవుడ్ మన్మధుడు. ఇప్పుడు మరో ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడు. ఈరోజు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజుగారి గది-2 మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ మోషన్ పోస్టర్ చూసిన జనాలు ఒకప్పటి శివను గుర్తు చేసుకున్నారు. పైన ఫొటోలో మనం చూస్తున్న సారూప్యత ఈ సినిమాతో మరోసారి కనిపించింది. శివ టైమ్ లో చేతిలో సైకిల్ చైన్ పట్టుకున్న నాగ్ కనిపిస్తే.. రాజుగారి గది-2లో చేతిలో రుద్రాక్ష మాల పట్టుకున్న నాగార్జున కనిపిస్తున్నాడు. ఈ పాతికేళ్లలో నాగ్ లుక్ మాత్రం మారలేదు. అందుకే టాలీవుడ్ మన్మధుడయ్యాడు నాగార్జున.

ఇక రాజుగారి గది-2 మోషన్ పోస్టర్ విషయానికొస్తే.. పక్కా ప్లానింగ్ తో ఈ మోషన్ తయారుచేసిన విషయం తెలుస్తోంది. హారర్ కామెడీ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అంతా నాగ్ చుట్టూనే తిరుగుతుందనే విషయాన్ని మోషన్ పోస్టర్ లో చెప్పేశారు. దీనికి తోడు చేతిలో రుద్రాక్షలు పెట్టారంటే… హారర్ కు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెడలో ఓం అక్షరంతో చైన్ ధరించిన నాగ్ స్టిల్స్ బయటకు రాగా.. ఇప్పుడు రుద్రాక్షలు పట్టుకున్న స్టిల్ విడుదలైంది. మోషన్ పోస్టర్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.