అర్జున్ రెడ్డిని మెచ్చుకున్న రామ్‌చ‌ర‌ణ్‌

Published On: September 11, 2017   |   Posted By:

అర్జున్ రెడ్డిని మెచ్చుకున్న రామ్‌చ‌ర‌ణ్‌

`అర్జున్ రెడ్డి` సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తున్నాయి. మ‌రీ హ‌ద్దు మించార‌ని గొడ‌వ‌లు చేస్తున్న వారు కూడా లేక‌పోలేదు. సినిమా విడుద‌ల‌కు ముందే అందులోని కొన్ని డైలాగుల‌ను సెన్సార్ బీప్ చేసింది. ఎ స‌ర్టిఫికెట్ కూడా ఇచ్చింది. వి.హెచ్‌.హ‌నుమంత‌రావు చేసిన ఆరోప‌ణ‌లు కూడా మీడియాలో దుమ్మురేపాయి . ఈ నేప‌థ్యంలో అర్జున్ రెడ్డి చాలా నేచుర‌ల్‌గా ఉందంటూ యువ‌త ఎగ‌బ‌డి చూసింది. తాజాగా చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ కూడా అర్జున్ రెడ్డి సినిమాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ వంగాకు, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు, నాయిక షాలినీకి, రాహుల్ రామ‌కృష్ణ‌న్‌కు హాట్సాఫ్ అన్నారు. ఈ సినిమా రాగా, రియ‌లిస్టిక్‌గా, బ్ల‌డీ బోల్డ్ గా ఉంద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.