అర్జున్ రెడ్డిపై కన్నేసిన తమిళ హీరోలు

Published On: August 30, 2017   |   Posted By:

అర్జున్ రెడ్డిపై కన్నేసిన తమిళ హీరోలు

తెలుగులో ఓ సినిమా హిట్ అయితే వెంటనే తమిళ హీరోల కన్నుదానిపై పడుతుంది. మరీ ముఖ్యంగా విజయ్, ఆర్య, శింబు లాంటి హీరోలు హిట్ తెలుగు సినిమాల్ని అస్సలు వదులుకోరు. ఇప్పుడీ తమిళ హీరోల కన్ను అర్జున్ రెడ్డిపై కూడా పడింది. మరీ ముఖ్యంగా చెన్నైలో విడుదలైన ఈ సినిమాను అక్కడి తెలుగు ప్రజలతో పాటు తమిళ స్టూడెంట్స్ కూడా తెగ చూస్తుండడంతో ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు ఈ హీరోలు

ప్రస్తుతం అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ వచ్చింది. ఎంతైనా ఇచ్చి రైట్స్ కొనుక్కునేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ రేసులో విశాల్ తండ్రి జీకే రెడ్డి కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది మేకర్స్ అయితే, ఏకంగా సందీప్ రెడ్డినే రీమేక్ కూడా హ్యాండిల్ చేయమని ఫ్యాన్సీ ఆఫర్లతో ఊరిస్తున్నారు.

ప్రస్తుతానికి అర్జున్ రెడ్డి సినిమాకు బాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్లు రాలేదు. త్వరలోనే ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ పై ఓ క్లారిటీ రానుంది. తాజా సమాచారం ప్రకారం, కోటి రూపాయలకు ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ అమ్ముడుపోవచ్చని తెలుస్తోంది.