అర్జున్ రెడ్డి ఓవర్సీస్ వసూళ్లు

Published On: August 28, 2017   |   Posted By:

అర్జున్ రెడ్డి ఓవర్సీస్ వసూళ్లు

ఓవర్సీస్ లో అర్జున్ రెడ్డి దూసుకుపోతున్నాడు. తమిళ బడా హీరో అజిత్ నటించిన వివేగం సినిమా వసూళ్లను కూడా అర్జున్ రెడ్డి క్రాస్ చేశాడంటే.. ఉత్తర అమెరికాలో ఈ సినిమా ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా శనివారం నాటికి ఏకంగా 7లక్షల 39 వేల 617 డాలర్లు ఆర్జించింది. ఆదివారం లేదా సోమవారం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ హై-ఇంటెన్సిటీ లవ్ డ్రామాలో ఎమోషన్స్ అన్నీ తీవ్రంగా ఉన్నాయి. చూసిన ప్రతి ప్రేక్షకుడు కొత్తగా ఫీలయ్యాడు. అత్యంత సహజంగా తెరకెక్కిన సన్నివేశాలు, డైలాగ్ లు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఓవర్సీస్ ప్రేక్షకులకు కూడా ఇవే ఎలిమెంట్స్ నచ్చాయి.

యూఎస్ఏలో ఈ సినిమాలో రోజువారీ వసూళ్లు ఇలా ఉన్నాయి
ఆగస్ట్ 24 – 1,94.051 డాలర్లు
ఆగస్ట్ 25 – 2,65,140 డాలర్లు
ఆగస్ట్ 26 – 2,80,426 డాలర్లు