అలాంటి సినిమాలు దేవిశ్రీ ఖాతాలోకే

Published On: August 14, 2017   |   Posted By:
అలాంటి సినిమాలు దేవిశ్రీ ఖాతాలోకే
కొన్ని విష‌యాలు యాదృచ్ఛికంగా జ‌రిగినా.. విన‌డానికి బాగుంటాయి. ఫ‌ర్ ఎగ్జాంపుల్ యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌నే తీసుకుంటే.. అత‌నికి స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం కామ‌న్ అయిపోయింది. అంతేకాకుండా.. వారి ల్యాండ్‌మార్క్ సినిమాల‌కు కూడా సంగీత‌మందించే అవ‌కాశం పొందుతూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు.
గ‌త సంక్రాంతికి  విడుద‌లైన దేవిశ్రీ మ్యూజిక‌ల్ ‘నాన్న‌కు ప్రేమ‌తో’ ఆ చిత్ర క‌థానాయ‌కుడు యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్‌కి ల్యాండ్ మార్క్ సినిమా. ఆ సినిమాతోనే హీరోగా తార‌క్ 25 చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఈ సంక్రాంతికి విడుద‌లైన దేవిశ్రీ మ్యూజిక‌ల్ ‘ఖైదీ నెం.150’.. ఆ చిత్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవికి 150వ చిత్రం. ఈ వ‌ర‌స‌లోనే మ‌రో స్టార్ హీరో ల్యాండ్ మార్క్ చిత్రం దేవిశ్రీ ఖాతాలో చేరింది. అదే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు 25వ చిత్రం.
ఇవాళే ప్రారంభ‌మైన ఈ సినిమాకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అన్న‌ట్టు.. న‌ట‌సింహం బాల‌కృష్ణ 100వ చిత్రం ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’కి కూడా డిఎస్పీనే మ్యూజిక్ అందించాల్సింది. కొన్ని కార‌ణాల వ‌ల్ల అది వ‌ర్క‌వుట్ అవ‌లేదు. మొత్తానికి దేవిశ్రీ ప్ర‌సాద్ ఖాతాలో స్టార్ హీరోల ల్యాండ్ మార్క్ సినిమాలు బాగానే చేరుతున్నాయి. ఇక ఈ ల్యాండ్ మార్క్ జాబితాలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రం కూడా చేరుతుందేమో చూడాలి.