అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య-3

Published On: August 1, 2017   |   Posted By:
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య-3
ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య-2 సినిమాలొచ్చాయి. త్వరలోనే ఆర్య-3 కూడా వస్తుందంటున్నాడు బన్నీ. సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన దర్శకుడు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన బన్నీ.. ఈ ప్రకటన చేశాడు. సుక్కూ దర్శకత్వంలో ఆర్య-3ని సెట్స్ పైకి తీసుకురావడానికి మ్యాగ్జిమమ్ ట్రై చేస్తానని ఎనౌన్స్ చేశాడు.
అటు సుకుమార్, ఇటు బన్నీకెరీర్లో ఆర్య సినిమా వెరీ వెరీ స్పెషల్ మూవీగా నిలిచింది. సుకుమార్ కు ఇదే మొదటి సినిమా కాగా.. బన్నీని ఫుల్ లెంగ్త్ హీరోగా నిలబెట్టింది కూడా ఇదే సినిమా. వీళ్లతో పాటు నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా ఆర్య సినిమా బ్రహ్మాండంగా కలిసొచ్చింది. ఆ తర్వాత సుక్కూ-బన్నీ కలిసి ఆర్య-2 సినిమా కూడా చేశారు.
ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత మళ్లీ కలిసి సినిమా చేయలేదు సుకుమార్, అల్లు అర్జున్. అందుకే ఈసారి కచ్చితంగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తానంటున్నాడు బన్నీ. ప్రస్తుతం ఈ హీరో.. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు.