అల్ల‌రి న‌రేశ్ సినిమా టైటిల్‌

Published On: May 23, 2018   |   Posted By:

అల్ల‌రి న‌రేశ్ సినిమా టైటిల్‌

అల్ల‌రి నరేశ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.
ఇందులో సునీల్ హీరో స్నేహితుడి పాత్రలో కనపడుతున్నారు. అలాగే హీరోయిన్ పూర్ణ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తమిళ సినిమాకు తెలుగు రీవేుక్‌గా సినిమా తెరకెక్కుతోంది. ఇంతకు ముందు అల్లరి నరేశ్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘సుడిగాడు’ మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. ఈ సినిమాను బ్లూ ప్లానెట్ ఎంటర్‌‌‌టైన్‌మెంట్ అధినేత కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు `సిల్లిఫెలో` అనే టైటిల్ విన‌ప‌డింది కానీ.. తాజాగా `వ‌చ్చాడ‌య్యో సామి` అనే టైటిల్‌ను పెట్టాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం.