అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ ఖ‌రారు

Published On: February 5, 2018   |   Posted By:

అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ ఖ‌రారు

ప్ర‌స్తుతం యువ క‌థానాయ‌కుల్లో అల్ల‌రి న‌రేష్‌కు కామెడీ హీరోగా చాలా మంచి పేరుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో న‌రేష్‌కు మంచి హిట్ లేదు. న‌రేష్ ఎన్ని ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు చేసినా పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. అందుక‌నే త‌న‌కు న‌చ్చిన కామెడీ జోన‌ర్‌లోనే సినిమా చేయ‌డానికి న‌రేష్ సిద్ద‌మైపోయారు. అల్ల‌రి న‌రేష్‌, సునీల్ ఇందులో ఫ్రెండ్స్‌గా న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాలో మా అబ్బాయి, రంగుల‌రాట్నం హీరోయిన్ శుక్ల‌ను హీరోయిన్‌గా తీసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమాను ఎ,కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ నిర్మిస్తుండ‌గా భీమినేని శ్రీనివాస‌రావు సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.