అవును  సైరాలో నేను కూడా ఉన్నాను – తమన్న

Published On: April 16, 2018   |   Posted By:
అవును  సైరాలో నేను కూడా ఉన్నాను – తమన్న
ఎట్టకేలకు ఓ పెద్ద పుకారుపై క్లారిటీ వచ్చేసింది. సైరా సినిమాలో తను కూడా ఉన్నాననే విషయాన్ని తమన్నా నిర్థారించింది. మొన్నటివరకు ఈ సినిమాలో నయనతార మాత్రమే హీరోయిన్ అని అంతా అనుకున్నారు. కానీ మరో కీలక పాత్రలో తను కూడా కనిపిస్తానని చెప్పుకొచ్చింది తమన్న. మరీ ముఖ్యంగా చిరంజీవి, అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందని ప్రకటించింది.
సైరాలో ఛాన్స్ తో ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది తమన్న. మెగా కాంపౌండ్ లో కీలకమైన పవన్, చరణ్, బన్నీ, చిరంజీవిలతో సినిమాలు చేసిన హీరోయిన్ గా గుర్తింపుతెచ్చుకోబోతోంది. ఇప్పటివరకు ఈ ఘనత కేవలం కాజల్ కు మాత్రమే సొంతం. ఇప్పుడు ఆ ఘనత దక్కించుకోబోతున్న రెండో హీరోయిన్ గా నిలవనుంది తమన్న.
సైరా సెట్స్ పైకి ఇంకా జాయిన్ అవ్వలేదు మిల్కీబ్యూటీ. త్వరలోనే చిరంజీవి, తమన్న కాంబినేషన్ లో సన్నివేశాలు తీస్తారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నానక్ రామ్ గూడలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.