అస‌లు విష‌యాన్ని చెప్పిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

Published On: October 20, 2017   |   Posted By:
అస‌లు విష‌యాన్ని చెప్పిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌
జై ల‌వ కుశ చిత్రంలో త్రిపాత్రాభిన‌యం చేసిన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మిల‌ట‌రీ ఆప‌రేటివ్ ఆఫీస‌ర్‌గా తార‌క్ క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అను ఇమ్మానియేల్ ఇందులో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ సంగీత‌మందించ‌నున్నాడ‌ని ఆ మ‌ధ్య క‌థ‌నాలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ విష‌యాన్ని అనిరుద్‌నే స్వ‌యంగా క‌న్‌ఫ‌ర్మ్ చేసేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రాబోతున్న కొత్త చిత్రానికి అనిరుద్‌నే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్న అనిరుద్‌కి.. ఆ త‌రువాత ఎన్టీఆర్‌తో చేయ‌బోయే సినిమాకి కూడా సంగీత‌మందించే ఛాన్స్ ఇచ్చాడన్న‌మాట త్రివిక్ర‌మ్‌.  వ‌రుస‌గా పెద్ద హీరోల‌తో సినిమాలు చేసే ఛాన్స్‌లు అందుకుంటున్న అనిరుద్‌.. త‌మిళంతో పాటు తెలుగులోనూ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిపించుకుంటాడేమో చూడాలి.