“అ!” మూవీ మొదటి రోజు వసూళ్లు

Published On: February 17, 2018   |   Posted By:
“అ!” మూవీ మొదటి రోజు వసూళ్లు
నాని నిర్మాతగా మారి, ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం “అ!”. ప్రశాంత్ వర్మ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాను డైరక్ట్ చేయగా.. కాజల్, నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, రెజీనా, ఇషా లాంటి తారలు నటించారు. ఏపీ, నైజాంలో స్వయంగా నాని ఈ సినిమాను రిలీజ్ చేసుకున్నాడు. పరిమితంగా రిలీజ్ అయిన కారణంగా ఈ సినిమాకు కోటి రూపాయలకు మించి మొదటి రోజు షేర్ రాలేదు. కొన్ని కీలకమైన ప్రాంతాలకు సంబంధించి “అ!” సినిమా తొలి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.
కీలక ప్రాంతాల్లో ఫస్ట్ డే షేర్
నైజాం – 38 లక్షలు
ఉత్తరాంధ్ర – 22 లక్షలు
ఈస్ట్ – 19 లక్షలు
కృష్ణా – 8 లక్షల 67 వేలు
నెల్లూరు – 1 లక్ష 50 వేలు