ఆక్సిజ‌న్ కి మ‌రో ముహుర్తం కుదిరింది

Published On: August 29, 2017   |   Posted By:

ఆక్సిజ‌న్ కి మ‌రో ముహుర్తం కుదిరింది

స‌రిగ్గా నెల రోజుల క్రితం గౌత‌మ్ నంద అంటూ రెండేసి పాత్ర‌ల్లో సంద‌డి చేశాడు యువ క‌థానాయ‌కుడు గోపీచంద్‌. ఆ చిత్రంలో ద్విపాత్రాభినం విష‌యంలో మెప్పించిన గోపీ.. క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయారు.

దీంతో త‌న త‌దుప‌రి చిత్ర‌మైన ఆక్సిజ‌న్‌తో హిట్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధ‌మౌతున్నాడు. ఈ నెల 18నే రావాల్సిన ఈ సినిమా కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌రోసారి వాయిదా ప‌డింది.

అయితే తాజాగా ఈ  చిత్రానికి విడుద‌ల తేదిని అక్టోబ‌ర్ 12గా ఫిక్స్ చేశార‌ని స‌మాచారమ్‌. రాశీ ఖ‌న్నా, అను ఎమ్మానియేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి జ్యోతికృష్ణ ద‌ర్శ‌కుడు.