ఆగస్ట్ 12 నుంచి బన్నీ కొత్త సినిమా షూటింగ్

Published On: August 1, 2017   |   Posted By:

ఆగస్ట్ 12 నుంచి బన్నీ కొత్త సినిమా షూటింగ్

దువ్వాడ జగన్నాథమ్ థియేటర్లలోకి వచ్చి చాలా రోజులైంది. కానీ ఇప్పటివరకు తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేదు బన్నీ. వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించనున్న ఈ సినిమా ఇప్పటికే గ్రాండ్ గా ప్రారంభమైంది. కానీ సెట్స్ పైకి మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే తేదీని ఖరారు చేశారు. ఆగస్ట్ 12 నుంచి “నా పేరు సూర్య” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నాగబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తారు.

“నా పేరు సూర్య” సినిమాకు “నా ఇల్లు ఇండియా” అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాలో మిలట్రీ మేన్ లా కనిపించబోతున్నాడు బన్నీ. ఈ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేసి, బాడీ బిల్డప్ చేయబోతున్నాడు బన్నీ. దీని కోసం ఒక దశలో అమెరికాకు కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ షూటింగ్ మరింత ఆలస్యమౌతుందనే ఉద్దేశంతో, అమెరికా నుంచి ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రయిలర్ ను హైదరాబాద్ రప్పిస్తున్నారు.

ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించనుంది. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్-శేఖర్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబయిలో ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్, జమ్ము ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.