ఆగస్ట్ 15న రవితేజ కొత్త సినిమా హంగామా

Published On: August 12, 2017   |   Posted By:
ఆగస్ట్ 15న రవితేజ కొత్త సినిమా హంగామా
ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు మాస్ మహారాజ్. వీటిలో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ మూవీ కాగా.. ఇంకోటి విక్రమ్ సిరికొండ డైరక్ట్ చేస్తున్న టచ్ చేసి చూడు. ఈ రెండు సినిమాల్లో అనిల్ రావిపూడి సినిమా ఇండిపెండెన్స్ డే నుంచి హంగామా చేయడానికి రెడీ అయింది. అవును.. ఆగస్ట్ 15న రాజా ది గ్రేట్ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు ఈ సినిమాని.
రవితేజ గత సినిమాల్లానే రాజా ది గ్రేట్ కూడా రెగ్యులర్ మాస్ ఎఁటర్ టైనర్ మూవీనే. కాకపోతే ఇందులో ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే… ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించబోతున్నాడు. సినిమాలో ఎంతసేపు రవితేజ అంధుడిగా కనిపిస్తాడనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ రవితేజ అంధుడనే విషయాన్ని మూవీ ఓపెనింగ్ రోజునే పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు.
మరి ఆగస్ట్ 15న విడుదలకాబోతున్న రాజా ది గ్రేట్ టీజర్ లో అంధుడి గెటప్ లో రవితేజ కనిపిస్తాడా.. లేక రెగ్యులర్ మాస్ యాంగిల్ లో మాస్ మహారాజ్ కనిపిస్తాడా అనేది వేచి చూడాల్సిందే.