ఆటోడ్రైవ‌ర్ అవ‌తారంలో  సాయిప‌ల్ల‌వి

Published On: May 17, 2018   |   Posted By:

ఆటోడ్రైవ‌ర్ అవ‌తారంలో  సాయిప‌ల్ల‌వి

ప్రేమ‌మ్ చిత్రంతో హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్నత‌దుప‌రి ఫిదా చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. త‌ర్వాత ఎంసిఎ సినిమా కూడా స‌క్సెస్ సాధించింది. క‌ణంతో మంచి న‌టిగా మ‌రోసారి త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది. `ఫిదా` చిత్రంలో కారును, ట్రాక్ట‌ర్‌ను న‌డిపిన సాయిప‌ల్ల‌వి  ఇప్పుడు ఆటో న‌డుప‌నుంది. వివ‌రాల్లోకి వెళితే.. సాయిప‌ల్ల‌వి  ధ‌నుశ్ హీరోగా రూపొందుతోన్న `మారి 2` సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇందులో ఆమె ఆటోడ్రైవ‌ర్‌గా న‌టిస్తుంది. బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌త్వంలో రూపొందుతోన్న `మారి 2`లో వ‌రల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.