ఆధారం చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Published On: December 29, 2020   |   Posted By:
ఆధారం చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
 
శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య భరత్ చంద్ర కథానాయకుడిగా గోపి పోలవరపు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం “ఆధారం”. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని షూటింగుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా  సోమవారం ఫిలిం ఛాంబర్ లో    నిర్మాత ప్రసన్నకుమార్, సాయివెంకట్ చేతుల మీదుగా బ్యానర్ మరియు , టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపి మాట్లాడుతూ “తొలి ప్రయత్నంగా సబ్జెక్టుపై నమ్మకంతో ‘ఆధారం’ చిత్రం చేస్తున్నా. ఈ నెల 30 నుంచి తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం” అని తెలిపారు.
 
 హీరో మాట్లాడుతూ “మంచి క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టు తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అన్నారు.
 
నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ “నిర్మాతగా దర్శకుడిగా గోపి చేస్తున్న ప్రయత్నం ఫలించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు. 
 
నిర్మాత రామ సత్య మాట్లాడుతూ “ఆధారం సినిమా 2021లో తొలి చిత్రంగా షూటింగ్ జరిగి హిట్ అవ్వాలని” ఆకాంక్షించారు.
 
నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూఅద్భుతమైన క్రైమ్ కథతో తెరకెక్కుతున్న ఆధారం చిత్రం మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.