ఆనందం టీజర్ రివ్యూ

Published On: March 12, 2018   |   Posted By:

ఆనందం టీజర్ రివ్యూ


మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్న సినిమా ఆనందం. ఇప్పుడీ సినిమా అదే పేరుతో తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం

ఆనందం టీజర్ చూసిన వెంటనే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా హ్యాపీ డేస్. కాలేజీ బ్యాక్ డ్రాప్, లవ్, స్టూడెంట్స్, ఎమోషన్స్.. ఇవన్నీ హ్యాపీ డేస్ సినిమాలో చూసేశాం. అందుకేనేమో తెలుగులో ఈ సినిమాకు హ్యాపీ డేస్ ఎగైన్ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. కానీ హ్యాపీ డేస్ సినిమాకు, అనందానికి అస్సలు సంబంధం ఉండదంటున్నారు మేకర్స్.

సరే.. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ఆనందం టీజర్ మాత్రం కలర్ ఫుల్ గా ఉంది. నవ్వులు, భావోద్వేగాలు, కేరింతలు.. ఇలా అన్నీ కలబోసి ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో నివిన్ పాల్ తో పాటు మరికొంతమంది నటీనటులు ఇందులో కనిపించారు. దాదాపు వీళ్లంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తే కాబట్టి.. సినిమా ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగించే ఛాన్స్ ఉంది. ఆనంద్ సినిమాటోగ్రఫీ, సచిన్ వారియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. టీజర్ లో ఆ ఫీలింగ్ ను ఇప్పటికే పరిచయం చేశాయి. మార్చి 23న విడుదలకానుంది ఆనందం సినిమా.