ఆనందో బ్రహ్మ ప్రివ్యూ

Published On: August 17, 2017   |   Posted By:

ఆనందో బ్రహ్మ ప్రివ్యూ

వీకెండ్ వచ్చిందంటే చాలు సినిమాల మధ్య పోటీ తప్పనిసరి. కానీ ఈ వీకెండ్ మాత్రం ఒకే ఒక్క తెలుగు సినిమా విడుదల అవుతోంది. అదే ఆనందో బ్రహ్మ మూవీ. మహి రాఘవ్ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ సినిమా ఈ వీకెండ్ సోలో రిలీజ్ గా మనముందుకు రాబోతోంది. సినిమాలో స్టార్ హీరోలు లేకపోయినా, స్టార్ హీరోయిన్ ఉంది. ఆమె తాప్సి. అవును.. తాప్సి ఎప్పీయరెన్స్ ఆనందో బ్రహ్మ సినిమాకు ఓ స్పెషల్ లుక్ తీసుకొచ్చింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేస్తున్న తాప్సి, ఆనందో బ్రహ్మ ప్రాజెక్టును ఎంచుకోవడం కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరోవైపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ ప్రత్యేక అతిథిగా హాజరవ్వడం కూడా ఆనందో బ్రహ్మ ప్రాజెక్టు నలుగురిలో నానేలా చేసింది. దీనికి తోడు ట్రయిలర్, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడం.. ప్రమోషన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేయడం ఆనందో బ్రహ్మ సినిమాకు బాగా కలిసొచ్చింది.

కాకపోతే ఈ సినిమాకు ఒకటే ఒక చిక్కు ఉంది. లాస్ట్ వీకెండ్ ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్, రానా సినిమాలు మూడూ ప్రస్తుతం థియేటర్లలో ఉన్నాయి. ఇవన్నీ ఆడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో వస్తున్న ఆనందో బ్రహ్మ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు మాత్రం దక్కలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లు పెరిగే ఛాన్స్ ఉంది.