ఆనందో బ్ర‌హ్మరివ్యూ

Published On: August 18, 2017   |   Posted By:

ఆనందో బ్ర‌హ్మరివ్యూ

సంస్థ: 70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌

న‌టీన‌టులుః తాప్సీ, శ్రీనివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క‌శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, రాజా ర‌వీంద్ర‌, టార్జాన్, విజ‌య్ చంద‌ర్‌, ర‌ఘు కారుమంచి,ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

ఎడిటింగ్ః  శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేని

మ్యూజిక్ః  కె

కెమెరా: అనిష్ త‌రుణ్‌కుమార్‌

ప్రొడ్యూసర్స్: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః మ‌హి వి.రాఘ‌వ్‌

విడుదల తేది: 18-08-2017

Censor:-“U/A”

Run Time:-123 minutes

రేటింగ్ః 2.75/5

 

అస‌లు దెయ్యం ఉందా?  లేదా? అనే విష‌యానికి వెళితే, ఎవ‌రి న‌మ్మ‌కం వారిది. అయితే టాలీవుడ్ సినిమాల్లో ప్ర‌స్తుతం హార‌ర్ కామెడీ చిత్రాలు హ‌వా న‌డుస్తుంది. టాలీవుడ్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మాత్రం ఈ దెయ్యాల కాన్సెప్ట్ సినిమాల‌తో బాగానే గ‌డిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా హార‌ర్ కామెడీ సినిమాలు వెండితెర‌పై సంద‌డి చేశాయి. అన్నీ సినిమాల్లోనూ దెయ్యాలే మ‌నుషుల‌ను భ‌య‌పెట్ట‌డం చూశాం. అయితే ఇందుకు విరుద్ధంగా ఉంటే ఎలా ఉంటుద‌ని ఆలోచించాడు ద‌ర్శ‌కుడు మ‌హి. పాఠ‌శాల ద‌ర్శ‌క నిర్మాత మ‌దిలో నుండి పుట్టిన ఆలోచ‌న నుండి రూపొందిన చిత్ర‌మే `ఆనందో బ్ర‌హ్మ`. ఇంత‌కు ముందు చెప్పినట్లు రొటీన్‌కు భిన్నంగా ద‌ర్శ‌కుడు మ‌హి దెయ్యాలు మ‌నుషుల‌ను చూసి భ‌య‌ప‌డితే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్‌తో సినిమాను తెర‌కెక్కించాడు. ఇలాంటి భిన్న‌మైన ఆలోచ‌న‌కు తాప్సీ, శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల‌కిషోర్‌, వంటి ప్ర‌ధాన తార‌ణం తోడ‌య్యారు. మ‌రి ఈ ఆనందో బ్ర‌హ్మ ఎలాంటి ఆనందాన్నిచ్చింద‌నే విష‌యాన్ని చూద్దాం..
క‌థః

 

తీర్థ‌యాత్ర‌లకు ఉత్త‌ర‌భార‌తానికి వెళ్లిన త‌ల్లిదండ్రులు అక్క‌డ వ‌ర‌ద‌ల్లో చిక్కుకుంటారు. దాంతో మ‌లేషియాలో ఉండే రాజు(రాజీవ్ క‌న‌కాల‌) వారిని వెతికే ప‌నిలో భాగంగా ఇండియా వ‌స్తాడు. ఎంత వెతికినా వారి జాడ దొర‌క‌దు. దాంతో మలేషియా వెళ్లిపోదామ‌నుకుంటాడు. హైద‌రాబాద్‌లోని ఇంటిని అమ్మేస్తే, ఇండియాకు ఇక రావాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని భావించిన రాజు ఇంటిని అమ్మకానికి పెడ‌తాడు. అయితే రాజు స్నేహితుడు రాజా ర‌వీంద‌ర్‌, యాద‌వ్‌(టార్జాన్‌)తో చేతులు క‌లిపి ఇంటిని త‌క్కువ ధ‌ర‌కే కొట్టేయాల‌ని ఇంట్లో దెయ్యాలున్నాయ‌ని ప్ర‌చారం చేస్తారు. క‌థ ఇలా సాగుతుండ‌గా సిద్ధు(శ్రీనివాస‌రెడ్డి) ఓ బార్‌లో ప‌నిచేస్తుంటాడు. అత‌ని గుండెకు రంధ్రం ఉంటుంది. గుండె ఆప‌రేష‌న్‌కు పాతిక ల‌క్ష‌లు అవ‌ర‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్స్ చెబుతారు. సిద్ధుకి డ‌బ్బులు అవ‌స‌ర‌మైన సెక్యూరిటీ గార్డు(వెన్నెల‌కిషోర్‌) ప‌రిచయం అవుతాడు. ఇత‌నికి రేచీక‌టి, చెవుడు ఉంటాయి. వీరికి స్ప్లిట్ ప‌ర్స‌నాలిటీతో బాధ‌ప‌డుతూ న‌టుడు కావాల‌నుకునే వ్య‌క్తి(ష‌క‌ల‌క శంక‌ర్‌), కొడుకు ఆప‌రేష‌న్‌కు డ‌బ్బులు కావాల‌నుక‌నే తాగుబోతు తండ్రి(తాగుబోతు ర‌మేష్‌)లు జ‌త క‌లుస్తారు. దెయ్యాలున్నాయ‌ని స్నేహితుల‌కు చెప్ప‌కుండా రాజుతో ఇంట్లో నాలుగు రోజులుంటాన‌ని, అందుకు ప్ర‌తిఫ‌లంగా డ‌బ్బులివ్వాల‌ని డీల్ కుదుర్చుకుంటాడు సిద్ధు. రాజు కూడా ఇంట్లో దెయ్యాలున్నాయ‌నే అప‌వాదు పోయి మంచి రేటు ప‌ల‌క‌డానికి స‌రేనంటాడు. న‌లుగురు స్నేహితులు ఇంట్లోకి వెళ‌తారు. వారేలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశారు?  నిజంగానే ఇంట్లో దెయ్యాలుంటాయా? ఇంత‌కు ఆ దెయ్యాలెవ‌రు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా వీక్షించాల్సిందే.
స‌మీక్షః

 

చిన్న చిత్రంగా రూపొందిన హార‌ర్ కామెడి కాబ‌ట్టి సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల పాత్ర స‌మానంగా ఉంటాయి. ముందుగా సాంకేతిక నిపుణుల విషయానికి వ‌స్తే…
ద‌ర్శ‌కుడు మ‌హి సినిమాను కొత్త పాయింట్‌లో తెరెకెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. దెయ్యాల‌కు న‌వ్వంటే భ‌యం పాయింట్ మీద మ‌నుషులు దెయ్యాల‌ను భ‌య‌పెట్టే స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు.

 

సినిమాలో ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌ర‌గుతున్న ఎమోష‌న‌ల్ పాయింట‌ను ట‌చ్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు మ‌హి. అనిష్ త‌రుణ్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. కె మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరావాలేదు. శ్ర‌వ‌ణ్ ఎడిటింగ్ ఓకే.

ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే తాప్సీ, శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, వెన్నెల‌కిషోర్‌లు క‌థ‌ను ముందుకు న‌డ‌ప‌డంలో కీల‌క‌పాత్ర‌లు పోషించారు. త‌మదైన న‌ట‌న‌తో, కామెడీ ట్రాక్‌ను పండించ‌డంతో స‌క్సెస్ అయ్యారు. గంగ సినిమా త‌ర్వాత తాప్సీ నటించిన మ‌రో హార‌ర్ కామెడీ చిత్ర‌మిది. ఇందులో తాప్సీ ఆత్మ క్యారెక్ట‌ర్‌లో క‌న‌పడింది. గంగ సినిమాలో తాప్పీ చేసిన పాత్ర‌తో పోల్చితే ఈ సినిమాలో తాప్పీ ఫెర్ఫామెన్స్‌కు పెద్ద స్కోప్ లేదు. ఎక్కువ ఆనందం వ‌స్తే ఏడుస్తూ, ఎక్కువ భ‌య‌మేస్తే న‌వ్వుతూ మెంట‌ల్ బేలెన్స్ థెర‌ఫీ చేసుకునే పాత్ర‌లో శ్రీనివాస‌రెడ్డి న‌ట‌న బావుంది. అంజ‌లి, జ‌య‌మ్మునిశ్చ‌య‌మ్మురా సినిమాల త‌ర్వాత శ్రీనివాస‌రెడ్డి చేసిన లీడ్ పాత్ర ఇది. ఇక చెవిటి, రేచీక‌టి వంటి అవ‌ల‌క్ష‌ణాలుండి భ‌య‌మేసిన‌ప్పుడు దెయ్య‌ముందో లేదో కూడా తెలియ‌కుండా ఫ్లూట్ వాయించే క్యారెక్ట‌ర్‌లో వెన్నెల‌కిషోర్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. రాత్రి 9 అయితే తాగకుండా ఉండ‌లేడు. తాగితే ఏం చేస్తాడో తెలియ‌దు. త‌న‌కు అచ్చొచ్చిన పాత్ర‌లో తాగుబోతు ర‌మేష్ అవ‌లీల‌గా నటించేశాడు. ఇక ష‌క‌ల‌క శంక‌ర్ స్ల్పిట్ ప‌ర్స‌నాలిటీ ఉన్న పాత్ర‌లో ఇర‌గ‌దీశాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్, రాందేవ్‌బాబా, కె.ఎ.పాల్ ల‌ను ష‌క‌ల‌క ఇమిటేట్ చేసే కామెడి బిట్ సూప‌ర్బ్‌గా ఉంటుంది. రాజీవ్‌క‌న‌కాల‌, విజ‌య్ చంద‌ర్‌, ప్ర‌భాస్ శ్రీను, విద్యుల్లేఖారామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌లకు న్యాయం చేశారు.
లోపాలుః
స్క్రీన్‌ప్లే ప్ర‌థ‌మార్థంలోని తొలి స‌న్నివేశం. ద్వితీయార్థం ప్రారంభం నుండి ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు వ‌చ్చే కామెడి ట్రాక్ బావుంది. అది మిన‌హా సినిమా అంతా రొటీన్ హార‌ర్ సినిమాల్లానే సాగింది. సినిమాల్లో లాజిక్స్ ప్ర‌కారం స‌న్నివేశాలుండానే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు మ‌ర‌చిన‌ట్లున్నారు.  ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న ఎమోష‌న‌ల్ పాయింట్‌ను ఆడియెన్స్‌కు క‌నెక్ట్ చేయ‌డంలో స‌ఫ‌లం కాలేదు.  క్లైమాక్స్ ముందు వ‌ర‌కు. సినిమాలో ఓ స‌న్నివేశంలో జీవా, సుప్రీత్‌లు న‌టించారు. జీవా ఏమ‌య్యాడ‌నే దానిపై క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు సుప్రీత్ ఎమైయ్యాడ‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు. స‌రే దెయ్యం చంపేసింద‌నుకుంటే సుప్రీత్‌ను మాత్ర‌మే చంపి, జీవాను ఎందుకు వ‌దిలేసింద‌నే డౌట్ వ‌స్తుంది. అలాగే రాజీవ్ క‌న‌కాల త‌ల్లి శ్రీనివాస్ రెడ్డి ద‌గ్గ‌ర ఎందుకుంటుందో వివ‌ర‌ణ క‌న‌ప‌డ‌దు. ఇలా స్క్రీన్‌ప్లేలో లోపాలున్నాయి.

అన్నింటికంటే మెచ్చుకోదగ్గ ఎలిమెంట్ ఏంటంటే.. కథకు అడ్డం పడే సాంగ్స్ లేవు ఈ సినిమాలో. అంతకంటే ముఖ్యంగా కీలకమైన సెకెండాఫ్ ను ఫుల్ కామెడీతో నింపేశారు. ఈ రెండు ఎలిమెంట్సే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే.. స్టార్టింగ్ లో పాత్రల పరిచయం, బోర్ కొట్టించే సన్నివేశాలు, క్లైమాక్స్ ను చెప్పుకోవచ్చు. అయితే హిలేరియస్ కామెడీతో నెగెటివ్స్ ను మరిచిపోవడం ఈజీనే.

చివ‌రగా..అర‌గంట పాటు వ‌చ్చే కామెడీ స‌న్నివేశాలు బాగానే న‌వ్వించినా మిగ‌తా క‌థ‌, క‌థ‌నం పెద్ద‌గా మెప్పించ‌దు.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వీకెండ్ సోలోగా వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమాను కామెడీ కోసం కచ్చితంగా చూడొచ్చు.