ఆనంద్ దేవ‌ర‌కొండ చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్

Published On: July 10, 2020   |   Posted By:

ఆనంద్ దేవ‌ర‌కొండ చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్‌

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా వినోద్ అనంతోజు ద‌ర్శ‌క‌త్వంలో  భ‌వ్య క్రియేష‌న్స్ చిత్రం  `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 11గా నిర్మించిన చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా….

`మిడిల్ క్లాస్ మెలోడీస్‌` చిత్ర నిర్మాత వెనిగ‌ళ్ల ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. తొలి కాపీ కూడా సిద్ధంగా ఉంది. క‌థ‌కు ప్రాధాన్య‌మిస్తూ సినిమాలు తీద్దామ‌నుకునే నిర్ణ‌యంలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. గుంటూరు నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. గుంటూరు జిల్లా కొల‌క‌లూరు ప్రాంతంలోనూ, గుంటూరు సిటీలోనూ… ప‌రిసర‌ ప్రాంతాల్లోనూ షూటింగు చేశాం. పాత్ర‌ల‌న్నీ గుంటూరు యాసలోనే మాట్లాడుతాయి. ఈ వేస‌వికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నాం. కానీ లాక్ డౌన్ ప‌రిస్థితుల వ‌ల్ల విడుద‌ల‌ను వాయిదా వేశాం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాం’’ అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు వినోద్ అనంతోజు మాట్లాడుతూ  “మామూలు మనుషుల జీవితాలలో ఉండే సున్నితమయిన హాస్యాన్ని ఇందులో చూపించాము. ప్రతి ఒక్కరూ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా పాత్రలుంటాయి. వాటితో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. ఆనంద్ దేవ‌ర‌కొండ తొలి చిత్రం `దొర‌సాని`కి పూర్తి భిన్నంగా ఇందులో ఆయ‌న పాత్ర ఉంటుంది.’కేరాఫ్ కంచ‌ర‌పాలెం`తో పాటు ప‌లు చిత్రాల‌కు సంగీతం అందించిన స్వీక‌ర్ అగ‌స్తి మా చిత్రానికి మంచి పాట‌లు ఇచ్చారు. మొత్తం ఐదు పాట‌లున్నాయి“ అని అన్నారు.

న‌టీన‌టులు:

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, చైత‌న్య గ‌రిక‌పాటి, దివ్య శ్రీపాద‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, సుర‌భి ప్ర‌భావ‌తి, ప్రేమ్ సాగ‌ర్‌, ప్ర‌భావ‌తి వ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

కెమెరా: స‌న్నీ కూర‌పాటి
క‌థ‌, సంభాష‌ణ‌లు:  జ‌నార్ద‌న్ ప‌సుమ‌ర్తి
స్క్రీన్‌ప్లే:  జ‌నార్ద‌న్ పసుమ‌ర్తి, వినోద్ అనంతోజు
ఎడిట‌ర్‌:  ర‌వితేజ గిరిజాల‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్:  సంజ‌నా శ్రీనివాస్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌:  వివేక్ అన్నామ‌లై
సంగీతం:  స్వీక‌ర్ అగ‌స్తి
ఒరిజిన‌ల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌:  ఆర్‌.హెచ్‌. విక్ర‌మ్‌,
సాహిత్యం:  సానాప‌తి భ‌ర‌ద్వాజ పాత్రుడు, శ్రీ సాయి కిర‌ణ్ , విస్సాప్ర‌గ‌డ ర‌వికృష్ణ‌,
గాయ‌నీగాయ‌కులు: ర‌మ్య బెహ‌రా, విజ‌య్ ఏసుదాస్‌, రామ్ మిర్యాల‌, అనురాగ్ కుల‌క‌ర్ణి, స్వీక‌ర్ అగ‌స్తి
సౌండ్ డిజైన‌ర్‌:  నాగార్జున తాళ్ల‌ప‌ల్లి
సౌండ్ మిక్సింగ్‌:  శ్యామ‌ల్ సిక్ద‌ర్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  న‌రేష్ రెడ్డి పోల‌సాని
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌:  అన్నే ర‌వి
నిర్మాత‌: వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: వినోద్ అనంతోజు