ఆఫీసర్ మూవీ రివ్యూ

Published On: June 1, 2018   |   Posted By:
ఆఫీసర్ మూవీ రివ్యూ
నటీనటులు- నాగార్జున, మైరా సరీన్, అజయ్, బేబీ కావ్య, అన్వర్ ఖాన్, ఫిరోజ్ అబ్బాసి, తదితరులు
దర్శకత్వం – రామ్ గోపాల్ వర్మ
సంగీతం – రవిశంకర్
సినిమాటోగ్రాఫర్ – రాహుల్ పెనుమత్స
ఎడిటర్ – అన్వర్ అలీ
ప్రొడ్యూసర్స్ – రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర
సెన్సార్ – యు/ఏ
నిడివి – 124 నిమిషాలు
విడుదల తేది : 01.06.2018
వరుసగా ఫ్లాపులొస్తున్నాయి. స్టార్ హీరోలంతా దాదాపు దూరమైపోయారు. ఇలాంటి టైమ్ లో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు నాగార్జున. మరి నాగ్ ఇచ్చిన అవకాశాన్ని వర్మ సద్వినియోగం చేసుకున్నాడా..? ఆఫీసర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడా..? బిజనెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
కథ
నారాయణ్ పసారి ముంబైలో  రఫ్ అండ్ టప్ పోలీస్. ఎన్ కౌంటర్లకు పెట్టింది పేరు. డిపార్ట్ మెంట్ అంతా అతడ్ని చూస్తే భయపడుతుంది. అలాంటి పసారిపై విచారణకు ఆదేశిస్తుంది ప్రభుత్వం. అతడిపై ఉన్న అక్రమాలపై విచారణ కోసం హైదరాబాద్ నుంచి శివాజీరావును తీసుకొస్తుంది. అందరు మంచోడు అనుకుంటున్న పసారిపై శివాజీ రావు విచారణ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడు చేసిన అక్రమాలు బయటపడతాడు.
పసారీని దోషిగా చూపించడం కోసం శివాజీరావు ఓ సాక్ష్యాన్ని పట్టుకుంటాడు. అతడ్ని కోర్టులో దోషిగా నిరూపించి, అరెస్ట్ చేయాలనుకుంటాడు. కానీ ఆ సాక్ష్యాన్ని పసారి చంపేస్తాడు. కోర్టు నుంచి నిర్దోషిగా బయటకు వస్తాడు. ఇక అక్కడ్నుంచి పసారి, శివాజి మధ్య వార్ మొదలవుతుంది. శివాజీని చంపాలని డిసైడ్ అవుతాడు పసారి. ఓసారి పార్క్ లో ఎటాక్ చేస్తాడు. అప్పుడు శివాజీని రక్షించబోయి మరో ఆపీసర్ అజయ్ ప్రాణాలు కోల్పోతాడు. ఈ క్రమంలో శివాజీ కూతుర్ని కిడ్నాప్ చేసి చంపాలనుకుంటాడు పసారి. మరి శివాజీరావు.. పసారిని ఎదుర్కోగలిగాడా..? పసారి ఓ క్రిమినల్ అని నిరూపించగలిగాడా..? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్
– నాగార్జున లుక్, యాక్టింగ్
– ఎమోషనల్ సన్నివేశాలు
– యాక్షన్ సీన్లు
మైనస్ పాయింట్స్
– మెయిన్ విలన్
– సెకండాఫ్
– స్క్రీన్ ప్లే
– క్లయిమాక్స్
– నాసిరకం నిర్మాణ విలువలు
బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ
యాక్షన్ సినిమాలు తీయడంలో వర్మ సిద్ధహస్తుడు. మరీ ముఖ్యంగా పోలీస్ డ్రామా అంటే వర్మ ఫేవరెట్. అలాంటి దర్శకుడు నాగార్జునను హీరోగా పెట్టి పోలీస్ కథ తీస్తున్నాడనగానే అంచనాలు పెరిగాయి. కానీ వర్మ ట్రాక్ రికార్డు ఈమధ్య కాలంలో అస్సలు బాగాలేదు. ఆ ట్రాక్ రికార్డులోకి ఆఫీసర్ రూపంలో ఇప్పుడు మరో సినిమా వచ్చి చేరినట్టయింది.
మంచి కథ సెలక్ట్ చేసుకున్న వర్మ దాన్ని తెరపై ఓ ఆర్డర్ లో చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. కెమెరా యాంగిల్స్, సౌండ్ ఎఫెక్టులపై పెట్టిన దృష్టి.. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే మీద, క్లయిమాక్స్ లో ఫైట్ మీద, నటీనటుల ఎక్స్ ప్రెషన్స్ మీద పెట్టి ఉండే చాలా బాగుండేది.
సినిమా మొత్తాన్ని నాగ్ ఒక్కడే లాక్కొచ్చాడు. చాన్నాళ్ల తర్వాత మోస్ట్ ఎగ్రెసివ్ గా, ఫిట్ గా కనిపించాడు నాగార్జున. చాన్నాళ్ల తర్వాత నాగార్జునను కంప్లీట్ యాక్షన్ మోడ్ లో చూడొచ్చు. ఇక హీరోయిన్ మైరా, చిన్నపిల్ల కావ్య చక్కగా నటించారు. నాగార్జునకు అంతోఇంతో సపోర్ట్ దక్కిందంటే వీళ్ల నుంచే. విలన్ గా నటించిన అన్వర్ ఖాన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వర్మ ఇతడ్ని ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడో అర్థం కాదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్ లో కూడా విలన్ ఆకట్టుకోలేకపోయాడు. ఆఫీసర్ కు అతిపెద్ద మైనస్ పాయింట్ ఇతడే. నాగ్ కోసం ప్రాణాలు అర్పించే పాత్రలో అజయ్ నటన బాగుంది.
ఇక టెక్నికల్ గా చూసుకుంటే.. వర్మ సినిమా కాబట్టి టెక్నికల్ గా బాగానే ఉంటుంది. కొన్ని సౌండ్ ఎఫెక్టులు బాగా పేలాయి. కెమెరాపనితనం బాగుంది. ముంబయి ఫీల్ వచ్చేలా వేసిన సెట్స్ బాగున్నాయి. ఆర్జీవీ కంపెనీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
అయితే టెక్నికల్ అంశాలపై చూపించిన శ్రద్ధను సెకెండాఫ్ పై కూడా పెట్టి ఉన్నట్టయితే ఆఫీసర్ రిజల్ట్ మరోలా ఉండేది. ఓవరాల్ గా చెప్పాలంటే ఆఫీసర్ ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ మాత్రం ఆకట్టుకోదు.
బాటమ్ లైన్ – ఆఫీసర్ ఆకట్టుకోలేకపోయాడు
రేటింగ్ – 2.5/5