ఆఫీసర్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Published On: March 13, 2018   |   Posted By:

ఆఫీసర్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆఫీసర్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మహారాష్ట్రలోని ముంబయితో పాటు పలు కీలకమైన లొకేషన్లలో జరిగింది. ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. దాదాపు 99శాతం షూటింగ్ పూర్తయినట్టు స్వయంగా నాగార్జున ప్రకటించాడు. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు మిగతా యూనిట్ మాత్రం ఇంకా మహారాష్ట్రలోనే ఉంది. మిగిలిన ప్యాచ్ వర్క్ కూడా పూర్తిచేసుకొని అప్పుడు హైదరాబాద్ వస్తారు.

హైదరాబాద్ లో కూడా ఈ మూవీకి సంబంధించి చిన్న ప్యాచ్ వర్క్ ఉంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు థియేట్రికల్ బిజినెస్ ప్రారంభిస్తారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కలుపుకొని  ఈ సినిమా 25 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మే 25న ఆఫీసర్ సినిమా థియేటర్లలోకి రానుంది.