ఆఫీస‌ర్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్‌

Published On: May 26, 2018   |   Posted By:
ఆఫీస‌ర్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్‌
 వైవిధ్య‌మైన సినిమాల‌ను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా ప్రిరీలీజ్ ఫంక్ష‌న్‌కు గెస్ట్‌గా రానున్నారు. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు.. ఆఫీస‌ర్‌. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ సినిమా జూన్ 1న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను మే 28న హైద‌రాబాద్ ఎన్ క‌న్వెన్ష‌న్‌లో నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సుకుమార్ ముఖ్య అతిథి. ఈ సినిమాను రామ్ గోపాల్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తూ నిర్మించారు . నాగార్జున ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో కనిపించ‌నున్నారు.