ఆఫీస‌ర్ క‌థ‌కు ఆయ‌నే స్ఫూర్తి అంటున్న వ‌ర్మ‌

Published On: May 19, 2018   |   Posted By:

ఆఫీస‌ర్ క‌థ‌కు ఆయ‌నే స్ఫూర్తి అంటున్న వ‌ర్మ‌

ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌.. ఓ కేసు ఇన్వెస్టిగేష‌న్ కోసం ముంబై వ‌స్తాడు. త‌న‌కు ఓ కూతురు కూడా ఉంటుంది. కేసును ప‌రిశోధించే స‌మ‌యంలో స‌ద‌రు ఆఫీస‌ర్ ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నాడు. వాటిని ఎలా అధిగ‌మించాడ‌నే క‌థ‌తో సంచ‌ల‌న దర్శ‌కుడు వ‌ర్మ త‌యారు చేసుకున్న క‌థే `ఆఫీస‌ర్‌`. ఈ సినిమాకు స్ఫూర్తి క‌ర్ణాట‌ల‌కు చెందిన పోలీస్ ఆఫీస‌ర్ ప్ర‌సన్న. ఈయ‌న స్ఫూర్తితోనే వ‌ర్మ ఆఫీస‌ర్ క‌థ‌ను త‌యారు చేసుకున్నాడ‌ట‌. 2010లో ప్ర‌స‌న్న ఓ కేసు గురించి వ‌ర్మ‌కు కొన్ని విష‌యాల‌ను తెలియ‌జేశాడ‌ట‌. దాన్ని విన్న త‌ర్వాత ఆ స్ఫూర్తితోనే `ఆఫీస‌ర్‌` క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. ఈ చిత్రం జూన్ 1న విడుద‌ల కానుంది.