ఆర్ .కె పురంలో పోస్టర్ లాంచ్

Published On: February 28, 2020   |   Posted By:

ఆర్ .కె పురంలో పోస్టర్ లాంచ్

సినీ నటి  రోజా  చేతుల మీదుగా `ఆర్ .కె పురంలో `  పోస్టర్ లాంచ్

 ప్రస్తుతం ఆడపిల్లల పై  జరుగుతున్న అకృత్యాల, అరాచకాల ఇతివృత్తం తో డాక్టర్ రంజిత్ కుమార్ డైరెక్షన్ లో దుగ్గిరాల నాగేశ్వరరావు నిర్మిస్తోన్న   చిత్రం `ఆర్ కె పురంలో`. కౌసల్య , దీప్తి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంభందించిన పోస్టర్ ఇటీవల సినీనటి రోజా చేతుల మీదుగా లాంచ్ చేశారు.  

ఈ సందర్భంగా  రోజా  మాట్లాడుతూ …“ఆడపిల్లల పట్ల జరుగుతున్న అరాచకాల ఇతివృత్తం తో సాగే సినిమా ఇది.  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేస్తున్న  ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా తెరకెక్కిస్తున్నారు.   ఇలాంటి గొప్ప మెసేజ్ తో సినిమా తీస్తున్న డైరెక్టర్ డాక్టర్ రంజిత్ కుమార్ నీ , నిర్మాత దుగ్గిరాల నాగేశ్వరరావు నీ అభినందించాలి.  సాటి మహిళల కోసం నా సహకారం ఎల్లప్పుడూ వుంటుందని“తెలిపారు.
  డైరెక్టర్ డాక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ …“ఆర్ కె పురం లో` చలనచిత్రం శ్రీ మతి ఆర్ కె రోజా గారి ఆశీస్సులతో  తెరకెక్కిస్తున్నాము. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.  ఇందులో 5పాటలు వుంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సినిమా కు కథే హీరో, మన చుట్టూ నిత్యం కనిపించే పాత్ర లే ఇందులో ఉంటాయి“అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నటీ  నటులు పాల్గొన్నారు.