ఆర్.డి.ఎక్స్.లవ్ మూవీ రివ్యూ

Published On: October 11, 2019   |   Posted By:

ఆర్.డి.ఎక్స్.లవ్ మూవీ రివ్యూ

Image

థియోటర్ నుంచి మూవ్ (‘ఆర్.డి.ఎక్స్.’రివ్యూ)

Rating:2/5.

కొన్ని ట్రైలర్స్ హిట్ అవుతాయి..మరికొన్ని సినిమాలు హిట్ అవుతాయి. రెండూ హిట్ అయిన సినిమాలు అడపా..దడపా ఎదురౌతాయి. ముఖ్యంగా చిన్న సినిమాని పెద్దగా చేసేవి క్రియేటివిటీతో కూడిన ట్రైలర్సే. ఆ విషయంలోనే ఈ సినిమా సక్సెస్ సాధించింది. అవి చూసి ఆవేశపడి థియోటర్ లో దూరితే ష్…అని నిట్టూర్చటం తప్పే చేయగలిగిందేమీ లేదు. ఆర్ డి ఎక్స్ లవ్ సినిమా టీజర్, ట్రైలర్  జనాలను రెచ్చగొట్టడానికి ట్రై చేసాయి. వారితో ఓపినింగ్స్ రప్పించే ప్రయత్నం చేసాయి. అయితే ట్రైలర్ లో ఉన్నంత విషయం సినిమాలో ఉందా. హాట్ కంటెంట్ ని సినిమాలో నిజంగా ఉందా…వాటివల్ల కథకు ఏమన్నా పని ఉందా లేక జనాల కోసమేనా…పాయిల్ నటించిన ఈ చిత్రం ఆమె మొదట చిత్రం ఆర్ ఎక్స్ 100 తరహాలో ఆడుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీలైన్

హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న అలివేలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌), కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ప్రమోట్ చేస్తూంటుంది. ఎయిడ్స్ నుంచి తప్పించుకోవాలంటే కండోమ్ వాడాలని,, సేఫ్ సెక్స్ అవసరమని చెప్తూంటుంది. ఆ క్రమంలో ఆమెకు సిద్దూ (తేజ‌స్‌)  పరిచయం అవుతాడు. ఇద్దరూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ప్రేమలో పడతారు. ఇలా సోషల్ వర్కర్ లా పనిచేస్తున్న ఆమె లక్ష్యం ముఖ్యమంత్రిని కలవాలని…ఆయన దృష్టికి ఓ సమస్యను తీసుకువెళ్లాలని. ఈ విషయంలో సిద్దు ఆమెకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసాడు. ఇక అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో ప్రమిఖ  టీవీ ఛానెల్ అధినేత గిరిప్ర‌కాష్‌(ఆదిత్య మీన‌న్‌) రంగంలోకి దిగుతాడు. ఆమెను చంపటానికి ప్రయత్నం చేస్తాడు. అసలు అలివేలు ఎవరు..ఆమెకు గిరి ప్రకాష్ కు చంపేసేటంత విభేధం ఏమిటి..సోషల్ వర్కర్ గా అలివేలు కనపడటానికి వెనక ఉన్న వ్యూహం ఏమిటి…ఆమె ప్రేమ కథ చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 


కథ,కథనం

ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఏముందండీ..ఓ ట్విస్ట్..బోల్డన్ని హాట్ సీన్స్ తప్ప…కాబట్టి మనం కూడా అలాంటి కథే ప్లాన్ చేద్దాం…అవకాసం ఉంటే ఆ అమ్మాయినే తీసుకుందాం. టైటిల్ కూడా కొంచెం అటూ ఇటూలో ఇమిటేట్ చేస్తూ అదే పెడదాం… అప్పుడు బిజినెస్ , మంచి ఓపినింగ్స్ వస్తాయి. ఇలా ఉంటాయి సగటు  సినీ నిర్మాత ఆలోచనలు. కళ కోసం ఈ రోజుల్లో ఫీల్డ్ కు రావాలని ఎవరూ అనుకోవటం లేదు కానీ మరీ దిగజారి సినిమా చేయాలని మాత్రం కోరుకోరు.  ఈ సినిమా చూస్తూంటే ఆర్ ఎక్స్ 100 ని క్యాష్ చేసుకోవాలని చేసే ప్రయత్నంలా అనిపిస్తుంది. అయితే ఆర్ ఎక్స్ 100 లో వర్కవుట్ అయిన ఎలిమెంట్ అయిన ట్విస్ట్ గొప్పతనాన్ని అర్దం చేసుకోలేదు. ఆ ట్విస్ట్ చుట్టూ అల్లిన రొమాన్స్ మీదే దృష్టి పెట్టారు. దాంతో ఈ సినిమా ఓ బి గ్రేడ్ వ్యవహారంలా మిగిలిపోయింది.  అంతెందుకు సినిమా టైటిల్ కూడా ఎక్కడా పొరపాటున కూడా కథతో లింక్ లేకుండా పెట్టారు. చిన్న పాయింట్ ని దగ్గర పెట్టుకుని దాని చుట్టూ బోల్డు సీన్స్ అల్లు కుంటూ పోయారు.  దాంతో విషయం లేని ఆ సీన్స్ వివిధ రకాలుగా చూసేవారిని హింస పెట్టాయి.

అలాగే సినిమా ప్రీ క్లైమాక్స్ దాకా అసలు విషయం లోకి రారు. అసలు హీరోయిన్ ఎవరో, ఆమె ఏ పర్ఫస్ మీద తిరుగుతోందో..విలన్ కు ఆమెకు ఉన్న రిలేషన్ ఏమిటో తెలియదు. దాంతో హీరోయిన్ చేసే పనులు సపోర్ట్ చేయాలా వద్దో తెలియదు. అలాగే అసలు ఆమె ఎవరో తెలియకుండా ఆమె మీద ఓ అభిప్రాయం ఏర్పడుచుకుని ఆమెతో ఐడింటిఫై అవటం కష్టం. ఆర్ ఎక్స్ 100 సినిమా ఓ నిజ జీవిత సంఘటనను తెరకెక్కించి యూత్ ని ఆకట్టుకుంటే…ఈ సినిమా ..తనకు తోచిన సమస్యను మన ముందు ఉంచి, దానికి ఓ చిత్రమైన పరిష్కారం ఇవ్వటానికి ప్రయత్నించింది.   ఏదైమైనా ఆర్ ఎక్స్ 100లో ఉన్నటువంటి కథా పరమైన ట్విస్ట్ ..ప్రేక్షకులకు కిక్ ఇచ్చిందనే విషయం గమనించకుండా ఆ సినిమాని అనుకరించాలనే ప్రయత్నం మాత్రం దురదృష్టకరమైనదే.

సాంకేతికంగా..

ఈ సినిమా ప్లస్ పాయింట్లలలో కెమెరా వర్క్ ఒకటి. విలేజ్ ఎట్మాస్ఫియర్, కల్చర్ ని బాగా పట్టుకుంది. రథన్ అందించిన పాటలు కలిసిరాకపోయినా,  బీజీఎమ్ మాత్రం బాగుంది. అళాగే , ప్రొడక్షన్ డిజైన్,, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ పూర్తిగా ఫెయిల్యూర్. కథ,డైలాగులు, డైరక్షన్ విషయాలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది.

చూడచ్చా…
అక్కడక్కడా వచ్చే అడల్ట్ డైలాగులకు ఆశపెడితే…అనంతమైన బోర్ ని భరించాల్సి వస్తుంది.
 
తెర ముందు..వెనక

బ్యాన‌ర్‌: హ‌్యాపీ మూవీస్‌
న‌టీన‌టులు: తేజ‌స్ కంచ‌ర్ల‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, ఆదిత్య మీన‌న్‌, నాగినీడు, న‌రేశ్‌, తుల‌సి, ఆమ‌ని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్: సి.వి.రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: పరుశురాం